AAI: ఏఏఐలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ! 14 d ago

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లో ఖాళీగా ఉన్న 89 జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. గరిష్ట వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్ మెన్కు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 11. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.